మధ్యదరాలోకి ఫ్రాన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్
ABN , Publish Date - Mar 05 , 2026 | 06:20 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సైప్ర్‌సలోని బ్రిటీష్ వాయుసేన స్థావరంపై సోమవారం జరిగిన దాడి నేపథ్యంలో తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్...
మిత్రదేశాలకు మద్దతుగా పంపిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్
న్యూఢిల్లీ, మార్చి 4: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సైప్ర్‌సలోని బ్రిటీష్ వాయుసేన స్థావరంపై సోమవారం జరిగిన దాడి నేపథ్యంలో తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘చార్లెస్ డీ గల్లె’ని మధ్యదరా సముద్రంలోకి పంపిస్తోంది. అణుశక్తితో నడిచే విమాన వాహక నౌక అయిన ‘చార్లెస్ డిగాల్’ బాల్టిక్ సముద్రం నుంచి మధ్యదరా వైపు వెళ్లాలని ఆదేశించినట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్ మెక్రాన్ ప్రకటించారు. మధ్యదరా సముద్ర తీరంలోని తమ మిత్రపక్షాలకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అలాగే, రఫేల్ ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఎయిర్‌బోర్న్ రేడార్ వ్యవస్థలను పశ్చిమాసియాకు ఇప్పటికే చేర్చామన్నారు. ఈ మేరకు మెక్రాన్ చెప్పిన సందేశం ఫ్రెంచ్ టీవీలో ప్రసారమైంది. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన సైప్ర్‌సతో ఫ్రాన్స్ ఇటీవలే వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఇవీ చదవండి:
ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..