Share News

మతం మారాలంటూ బలవంతం చేశారు: విప్రో మాజీ ఉద్యోగిని

ABN , Publish Date - Jun 04 , 2026 | 09:01 PM

విప్రో పుణె క్యాంపస్‌లో పని చేసిన ఒక మహిళ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన బాస్ బలవంతం చేశారని ఆరోపించారు.

మతం మారాలంటూ బలవంతం చేశారు: విప్రో మాజీ ఉద్యోగిని
Workplace Harassment Case in Pune

ఇంటర్నెట్ డెస్క్: విప్రో పుణె క్యాంపస్‌లో పని చేసిన ఒక మహిళ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. మతం మారాలంటూ తన బాస్ బలవంతం చేశారని ఆరోపించారు. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను చివరకు రాజీనామా చేశానని చెప్పారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె పుణెలోని హింజెవాడిలోగల విప్రో క్యాంపస్‌లో పనిచేశారు. మతవిశ్వాసాల కారణంగా తాను కంపెనీలోని సీనియర్ మేనేజర్లు, టీమ్‌ లీడర్లకు టార్గెట్‌గా మారానని చెప్పారు. ఇస్లామ్‌లోకి మారాలంటూ నిరంతరం తనను వేధించారని అన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు తన మేనేజర్ మరిన్ని వేధింపులకు దిగిందని చెప్పారు. తన పనితీరు బాలేదని నివేదిక ఇస్తానని బాస్ తనను బెదిరించిందని కూడా ఆరోపించారు. చివరకు ఈ వేధింపులు తాళలేక తాను రాజీనామా చేశానని చెప్పారు.


కంపెనీ నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో చివరకు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టు చెప్పారు. విప్రోలో ఒక మహిళా మేనేజరు తనను వేధిస్తోందని ఆ మాజీ ఉద్యోగిని ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె ఆరోపణలపై విచారణ ప్రారంభించామని అన్నారు.

ఈ ఘటనపై విప్రో ప్రతినిధి కూడా స్పందించారు. ఈ కేసులో అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. వారికి కావాల్సిన సమాచారం, డాక్యుమెంట్స్‌ను ఇచ్చామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

సరోగసీ కేంద్రాల నియంత్రణ.. కేంద్రం అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు

Updated Date - Jun 04 , 2026 | 09:10 PM