Share News

బలవంతపు మత మార్పిడి కేసులో నిదా ఖాన్‌కు బెయిల్‌ మంజూరు

ABN , Publish Date - Jul 10 , 2026 | 05:32 AM

కారాగారంలో ప్రసవవేదన అనుభవించడం ఏ మహిళకైనా కష్టమేనని నాసిక్‌ అదనపు సెషన్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది. బలవంతపు మతమార్పిడి కేసులో...

బలవంతపు మత మార్పిడి కేసులో నిదా ఖాన్‌కు బెయిల్‌ మంజూరు

నాసిక్‌, జూలై 9: కారాగారంలో ప్రసవవేదన అనుభవించడం ఏ మహిళకైనా కష్టమేనని నాసిక్‌ అదనపు సెషన్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది. బలవంతపు మతమార్పిడి కేసులో అరెస్టయిన టీసీఎస్‌ మాజీ అధికారిణి నిదా ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్య చేసింది. తోటి ఉద్యోగులకు బ్రెయిన్‌వా్‌ష చేసి బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దాదాపు రెండు నెలల క్రితం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి కావడంతో బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై అదనపు సెషన్స్‌ జడ్జి కె.జి.జోషి విచారణ జరిపి సానుకూల ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 10 , 2026 | 05:32 AM