Share News

నవంబర్ 1 నుంచి ఫాస్టాగ్ లోకల్ పాస్.. ఏడాదికి రూ.1,500 లేదా రూ.3,000తో టోల్ ప్రయాణాలు..

ABN , Publish Date - Oct 27 , 2026 | 09:40 PM

జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

నవంబర్ 1 నుంచి ఫాస్టాగ్ లోకల్ పాస్.. ఏడాదికి రూ.1,500 లేదా రూ.3,000తో టోల్ ప్రయాణాలు..
FASTag local pass

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల సమీపంలో నివసించే వారికి కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే అర్హులైన ప్రైవేటు వాహనదారులు ఇకపై ఏడాదికి రూ.1,500 లేదా రూ.3,000 చెల్లించి రాయితీతో కూడిన స్థానిక టోల్ పాస్ పొందవచ్చు. ఈ కొత్త విధానం 2026 నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అక్టోబర్ 26న ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేసింది (FASTag local pass).


కొత్త నిబంధనల ప్రకారం టోల్ ప్లాజా ఎక్కడ ఉందన్నదాని ఆధారంగా పాస్ ధర నిర్ణయించారు. పట్టణ పరిధి వెలుపల ఉన్న టోల్ ప్లాజాకు సమీపంలోని నివసించే వారు ఏడాదికి రూ.1,500 చెల్లించి పాస్ తీసుకోవాలి. అలాగే మున్సిపాలిటీ లేదా పట్టణ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాకు సమీపంలో నివసించే వారు ఏడాదికి రూ.3,000 చెల్లించాలి. ఈ పాస్ తీసుకున్నవారు సంబంధిత టోల్ ప్లాజా వద్ద తరచూ ప్రయాణించేటప్పుడు ప్రతిసారీ టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం అమల్లో ఉన్న నెలవారీ స్థానిక పాస్‌కు బదులుగా ఈ వార్షిక పాస్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఏప్రిల్ 1న ఈ ధరలను సవరించవచ్చు (FASTag new rules November 1).


ఈ రాయితీ పాస్ పొందాలంటే కొన్ని అర్హతలు తప్పనిసరిగా ఉండాలి (Toll plaza local pass). సంబంధిత టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించాలి. వాహనం వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించేదై ఉండాలి. ఫాస్టాగ్ వాణిజ్యేతర వాహనంగా నమోదై ఉండాలి. ఈ పాస్ ఒక నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే వర్తిస్తుంది. ఒక ప్లాజా కోసం తీసుకున్న పాస్‌తో ఇతర టోల్ ప్లాజాల వద్ద ఉచితంగా ప్రయాణించలేరు. ప్రస్తుతం నెలకు రూ.360 చొప్పున స్థానిక పాస్ తీసుకునే అర్హులైన వాహనదారులకు ఏడాది ఖర్చు రూ.4,320 అవుతుంది. కొత్త వార్షిక పాస్‌తో పట్టణ పరిధి వెలుపల ఉన్న టోల్ ప్లాజాలకు రూ.1,500, పట్టణ పరిధిలో ఉన్న ప్లాజాలకు రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

చైనా చొరబాటు అంటూ తప్పుడు ప్రచారం.. కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి: కిరణ్ రిజిజు


అమెరికా భారీ సైనిక ప్రణాళిక.. భారీ యుద్ధం వచ్చినా 90 రోజులు పనిచేసేలా..

Updated Date - Oct 27 , 2026 | 09:40 PM