ఎప్‌స్టీన్ బాధితుల్లో భారతీయ బాలిక!
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:15 AM
ఎప్‌స్టీన్ లైంగిక నేరాల బాధితుల్లో భారత్‌కు చెందిన ఓ బాలిక కూడా ఉందని తాజాగా వెల్లడైంది. ‘ఎప్‌స్టీన్’ ఫైల్స్‌లోని ఈ-మెయిల్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. బాధితుల ఫండ్ నుంచి...
ఎప్‌స్టీన్ ఈ-మెయిల్స్ సంభాషణలో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఎప్‌స్టీన్ లైంగిక నేరాల బాధితుల్లో భారత్‌కు చెందిన ఓ బాలిక కూడా ఉందని తాజాగా వెల్లడైంది. ‘ఎప్‌స్టీన్’ ఫైల్స్‌లోని ఈ-మెయిల్స్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. బాధితుల ఫండ్ నుంచి ఆమెకు పరిహారం అందించేందుకు, సదరు బాధితురాలు ఎక్కడ ఉందనే విషయంపై అమెరికా అధికారుల ఓ ఈ-మెయిల్‌లో చర్చ జరిగింది. సదరు బాధిత బాలిక ఆచూకీ కోసం భారతీయ రాయబార కార్యాలయంతో సంప్రదింపులు చేయడంపై కూడా అధికారులు మాట్లాడుకున్నారు. ‘భారత్‌లో ఉన్న వ్యక్తి అడ్రస్, సమాచారాన్ని మీరు ఇవ్వగలిగితే.. నేను అక్కడి రాయబార కార్యాలయంలోని మా సహోద్యుగులతో సమన్వయం చేసుకుంటాను. మీకు ఏవైనా అదనపు ప్రశ్నలు ఉంటే, దయచేసి నాకు కాల్ చేయండి’ అని ఆ మెయిల్‌లో రాసి ఉంది. ఈ మెయిల్‌ను పంపిన, స్వీకరించిన వారి పేర్లను ఫైల్స్‌లో అస్పష్టంగా ఉంచారు. అయితే ‘ఎప్‌స్టీన్ బాధితులు’ అనే సబ్జెక్టు పేరుతో ఉన్న 2020 జనవరి 12న నాటి ఈ మెయిల్‌లో జరిగిన కమ్యూనికేషన్ విధానాన్ని పరిశీలిస్తే.. అది అమెరికా అధికారుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ పురీ పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దర్శనమివ్వగా.. కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్ పేరు కూడా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌తో భేటీ కావడంపై ఎప్‌స్టీన్, బిల్‌గేట్స్ మధ్య 2014లో సంభాషణ జరిగింది.
ఎప్‌స్టీన్‌తో 14 సార్లు పురీ భేటీ: కాంగ్రెస్
‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ అంశంపై హర్దీప్ పురీ అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఎప్‌స్టీన్‌కు, పురీ మధ్య 2014, 2017 మధ్యకాలంలో 62 ఈ-మెయిల్ సంభాషణలు జరిగాయని, 14సార్లు సమావేశమయ్యారని పేర్కొంది. వారు ఏం మాట్లాడుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాలంది. కేంద్ర మంత్రి పదవికి పురీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ