Share News

ఫిబ్రవరి వరకు ఎల్‌నినో!

ABN , Publish Date - Sep 05 , 2026 | 06:20 AM

పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి, అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) తెలిపింది.

ఫిబ్రవరి వరకు ఎల్‌నినో!

  • భారత్‌పై తీవ్ర ప్రభావం.. కరువు, భారీ ఉష్ణోగ్రతలు

  • వరదలు కొనసాగే అవకాశం.. ప్రపంచ వాతావరణ సంస్థ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: పసిఫిక్‌ మహాసముద్ర ప్రాంతంలో ఏర్పడిన ఎల్‌నినో పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత బలపడి, అత్యంత తీవ్రమైన స్థాయికి చేరే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) తెలిపింది. ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగనుందని పేర్కొంది. ఫలితంగా వర్షాలు, ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపనుందని, కరువు, ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని, వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్‌ సెలెస్టే సాలో గురువారం ఓ నివేదికలో పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం భారత్‌పై ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సైతం ఎల్‌నినో 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనుందని ఇప్పటికే పేర్కొంది. ప్రస్తుత నెలలో దీర్ఘకాలిక సగటులో 91 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.

Updated Date - Sep 05 , 2026 | 06:21 AM