Share News

రెండు అనిల్‌ అంబానీ విమానాలను స్వాధీనం చేసుకున్న ఈడీ

ABN , Publish Date - Nov 04 , 2026 | 05:46 AM

బ్యాంకు రుణాలను దుర్వినియోగం చేసిన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.

రెండు అనిల్‌ అంబానీ విమానాలను  స్వాధీనం చేసుకున్న ఈడీ
ed

న్యూఢిల్లీ, నవంబరు 3: బ్యాంకు రుణాలను దుర్వినియోగం చేసిన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చెందిన చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది. రెండు ఛార్టర్డ్‌ విమానాలు, మహారాష్ట్రలోని 6స్థలాలు, తమిళనాడులోని రెండు పవన విద్యుత్తు కేంద్రాలు, బ్యాంకు డిపాజిట్లను ఆటాచ్‌ చేసినట్టు వివరించింది. వీటి విలువ రూ.510 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. దీంతో ఇంతవరకు అటాచ్‌ చేసిన ఆస్తుల విలువ రూ.23,100 కోట్లకు చేరుకుందని పేర్కొంది.

Updated Date - Nov 04 , 2026 | 05:53 AM