పీఏ ఇంట్లో ఈడీ సోదాలు..
ABN , Publish Date - Sep 13 , 2026 | 04:14 AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడి(పీఏ) నివాసంపై ఈడీ దాడుల నేపథ్యంలో పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు
కాంగ్రెస్ పదవులకు హరీశ్ రావత్ రాజీనామా
డెహ్రాడూన్, సెప్టెంబరు 12: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత సహాయకుడి(పీఏ) నివాసంపై ఈడీ దాడుల నేపథ్యంలో పార్టీకి చెందిన అన్ని బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం ప్రకటించారు. ఉత్తరాఖండ్ పీసీసీ కార్యవర్గ సభ్యత్వానికి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడి హోదాకు రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ వ్యవహారం పార్టీ ఎన్నికల ప్రచారంపై ఎలాంటి ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరీశ్ రావత్ స్పష్టం చేశారు. ఆయన పీఏ చందన్‌సింగ్ జీనా నివాసంలో గురువారం సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. రూ.32 లక్షల నగదు, 12 లగ్జరీ వాచీలు, అనేక బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.