Share News

‘ఈ-20’తో మైలేజీకి 5 శాతం గండి!

ABN , Publish Date - Jul 11 , 2026 | 06:08 AM

ఇథనాల్‌ కలిపిన ఈ-20 పెట్రోల్‌ వినియోగంతో వాహనాల మైలేజీ 5ు మేరకు తగ్గుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. అయితే.. మైలేజీ తగ్గినప్పటికీ దీనివల్ల పర్యావరణానికి...

‘ఈ-20’తో మైలేజీకి 5 శాతం గండి!

  • కానీ, కర్బన ఉద్గారాలు తగ్గుతాయ్‌

  • కేంద్ర పెట్రోలియం శాఖ వివరణ

న్యూఢిల్లీ, జూలై 10: ఇథనాల్‌ కలిపిన ఈ-20 పెట్రోల్‌ వినియోగంతో వాహనాల మైలేజీ 5ు మేరకు తగ్గుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ తెలిపింది. అయితే.. మైలేజీ తగ్గినప్పటికీ దీనివల్ల పర్యావరణానికి అనేక మేళ్లు జరుగుతాయని పేర్కొంది. అధిక ఆక్టేన్‌ రేటింగ్‌, పికప్‌, కర్బన ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించింది. ఇక, ఈ ప్రాజెక్టును ఉన్నపళంగా అమలు చేశారన్న వాదనను కూడా పెట్రోలియం శాఖ తోసిపుచ్చింది. రాత్రికి రాత్రి ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోలు వినియోగాన్ని అమల్లోకి తీసుకురాలేదని, 2001లోనే దశల వారీగా దీనిని పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేసినట్టు పేర్కొంది. ధరల విషయంపై స్పందిస్తూ.. సంప్రదాయ పెట్రోల్‌తో పోల్చుకుంటే ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ ధరలు ఎక్కువగానే ఉంటాయని తెలిపింది. అయితే, ఈ-20 పెట్రోల్‌తో వాహన జీవిత కాలం మెరుగుపడుతుందని పేర్కొంది. ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో కీలక అంశాలపై పెట్రోలియం శాఖ డాక్యుమెంటు విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని ఆకస్మికంగా అమలు చేశారన్న వాదనను తోసిపుచ్చింది. 2001లోనే పైలట్‌ ప్రాజెక్టుగా ఇది ప్రారంభమైందని, 2006నాటికే 5 శాతం ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ వినియోగాన్ని పలు ప్రాంతాల్లో ప్రవేశపెట్టారని తెలిపింది. 2022 నాటికి 10%, 2025-26 నాటికి 20ు ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ సాధించినట్టు వివరించింది. ఇథనాల్‌ బ్లెండింగ్‌ ప్రోగ్రామ్‌తో రూ.1.97 లక్షల కోట్ల మేరకు విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని పేర్కొంది. 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగినట్టు తెలిపింది.

Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 11 , 2026 | 06:08 AM