Share News

కుక్క నోటిలో మనిషి కాలు.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Feb 25 , 2026 | 02:30 PM

ఓ కుక్క మనిషి కాలుతో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుక్క నోటిలో మనిషి కాలు.. వైరల్‌గా మారిన వీడియో..
Shimla hospital

షిమ్లా, ఫిబ్రవరి 25: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఓ కుక్క మనిషి కాలుతో రోడ్డుపై చక్కర్లు కొట్టింది. షిమ్లాలోని అటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు చెప్పిన సమాచారం మేరకు.. గత గురువారం 61 ఏళ్ల అత్తర్ సింగ్ అనే వ్యక్తి కాలును డాక్టర్లు తొలగించారు. తొలగించిన కాలు భాగాన్ని కవర్‌‌లో ఉంచి స్టోర్ రూములో భద్రపరిచారు.


శానిటేషన్ సిబ్బందికి దాన్ని డిస్పోజ్ చేయమని డాక్టర్లు చెప్పారు. ఫిబ్రవరి 22వ తేదీ (సోమవారం) ఆస్పత్రి సిబ్బంది స్టోర్ రూము డోర్ వేయటం మర్చిపోయారు. దీంతో ఓ కుక్క స్టోర్‌ రూములోకి ప్రవేశించింది. కవర్‌‌లో ఉన్న కాలును ఎత్తు కెళ్లిపోయింది. కుక్క కాలుతో రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాల తాలూకా వీడియో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.


విధుల్లో అలసత్వం వహించిన కారణంగా శానిటేషన్ సూపర్ వైజర్‌తో పాటు శానిటేషన్ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో చూస్తుంటే నా ఒళ్లు జలదరించింది. చాలా దారుణంగా ఉంది’..‘విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిని ఉద్యోగంలోనుంచి వెంటనే తీసేయాలి’.. ‘అయ్య బాబోయ్ .. వీడియో ఎంత దారుణంగా ఉంది. చూడాలంటే భయంగా ఉంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..

Updated Date - Feb 25 , 2026 | 02:53 PM