Share News

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై హర్షం వ్యక్తం చేసిన వాంగ్‌చుక్‌

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:21 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయని పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై హర్షం వ్యక్తం చేసిన వాంగ్‌చుక్‌
dharmendra pradhan resigns

న్యూఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ హర్షం వ్యక్తం చేశారు. ఇది పట్టుదలతో యువత సాధించిన విజయని పేర్కొన్నారు. జెన్-జీ, సీజేపీ ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో..


‘ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది శాంతి, ఓర్పు, నిరంతర పట్టుదలల విజయం. దేశంలోని సీజేపీ, జెన్ జీ యువతకు అభినందనలు. భయాన్ని వీడి దేశం నలుమూలల నుంచి పోరాటానికి కదలివచ్చిన పౌరులందరికీ ధన్యవాదాలు. ఇప్పటివరకు బాధ్యతాయుతమైన సమాధానం కోరాం. ఇకపై సంస్కరణల వైపు సాగుదాం’ అని రాసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

ఏపీలో మొత్తం ఓటర్లు 4.16 కోట్లు: సీఈఓ వివేక్ యాదవ్

Updated Date - Jul 25 , 2026 | 04:31 PM