ఆ బాలికపై ఏ కేసు నమోదు చేయట్లేదు: ఢిల్లీ పోలీసులు
ABN , Publish Date - Aug 04 , 2026 | 07:04 AM
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై ఎటువంటి కేసు నమోదు చేయకూడదని...
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల సందర్భంగా ప్రధానిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన 15 ఏళ్ల బాలికపై ఎటువంటి కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు. ప్రధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో సదరు బాలికపై తొలుత నోయిడా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అందులో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సదరు బాలిక క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేసింది. తన వయసు 15 ఏళ్లేనని.. పక్కనున్న వారి ప్రభావంతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. మరోవైపు ప్రధాని మోదీ..తనను దూషించిన పిల్లలను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ
బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..