Share News

దేశ రాజధాని అష్టదిగ్బంధనం

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:13 AM

రాజధాని న్యూఢిల్లీలో ‘సర్‌’ వ్యతిరేక ఉద్యమం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దేశ రాజధాని   అష్టదిగ్బంధనం
police alert in new delhi

  • నేడు ప్రతిపక్ష నేతల నిరసన మార్చ్‌

  • 10న ధర్నాకు అనుమతిపై

సుప్రీం కోర్టులో సీజేపీ పిటిషన్‌

  • సర్‌కు వ్యతిరేకంగా

నేడు ఢిల్లీలో విపక్షాల నిరసన

న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని న్యూఢిల్లీలో ‘సర్‌’ వ్యతిరేక ఉద్యమం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జంతర్‌ మంతర్‌ వద్ద నిషేధాజ్ఞలు విధించినప్పటికీ పెద్ద ఎత్తున ఆందోళనకారులు అక్కడికి చేరేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకునేందుకు భద్రతా బలగాలు కూడా భారీగా మోహరించాయి. ఓట్‌ చోరీని నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ఇండియా కూటమికి చెందిన పార్టీల నేతలు ఊరేగింపుగా వెళ్లాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. జంతర్‌మంతర్‌కు దారి తీసే అనేక మార్గాలపై బారికేడ్లు నిర్మించడం, వేల సంఖ్యలో పోలీసులు, ఇతర బలగాలను నియమించడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. న్యూఢిల్లీ జిల్లా అంతటా భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలోని సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీసులు తెలిపారు. జంతర్‌ మంతర్‌ చుట్టుపక్కల ఉన్న టాల్‌ స్టాయ్‌ మార్గ్‌, సంసద్‌ మార్గ్‌, జనపథ్‌, అశోకా రోడ్‌ మొదలైన అనేక మార్గాలను మూసివేయడంతో ఎటు నుంచి వెళ్లాలో తెలీక ప్రయాణికులు నానా అవస్థలకు గురికావల్సి వస్తోంది. అనేక చోట్ల మెట్రో రైల్వే స్టేషన్ల ప్రవేశ ద్వారాలను మూసివేశారు. పార్లమెంట్‌ మకర ద్వారం నుంచి ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ మీదుగా ప్రతిపక్షాలు వెళ్లకుండా సంసద్‌ మార్గ్‌ ప్రారంభంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ నెల 10న జంతర్‌ మంతర్‌ వద్ద మళ్లీ నిరసన ప్రదర్శన ప్రారంభిస్తామని కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రకటించిన దృష్ట్యా ఢిల్లీ రణరంగంగా మారే పరిస్థితులు ఎదురు కానున్నాయి. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నందున అనుమతి కావాలంటూ కాక్రోచ్‌ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 03:19 AM