Share News

కేజ్రీవాల్‌ తరఫున వాదనలకు కోర్టే లాయర్లను నియమిస్తుంది

ABN , Publish Date - May 06 , 2026 | 07:11 AM

మద్యం విధానం కేసులో ఆప్‌ నాయకులు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, దుర్గేష్‌ పాఠక్‌ల తరఫున వాదనలు వినిపించడానికి ఢిల్లీ హైకోర్టే న్యాయవాదులను నియమించనుంది...

కేజ్రీవాల్‌ తరఫున వాదనలకు కోర్టే లాయర్లను నియమిస్తుంది

  • ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ప్రకటన

  • న్యాయవాదుల పేర్లను 8న వెల్లడిస్తాం

న్యూఢిల్లీ, మే 5: మద్యం విధానం కేసులో ఆప్‌ నాయకులు అరవింద్‌ కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియా, దుర్గేష్‌ పాఠక్‌ల తరఫున వాదనలు వినిపించడానికి ఢిల్లీ హైకోర్టే న్యాయవాదులను నియమించనుంది. ముగ్గురు సీనియర్‌ లాయర్లను అమికస్‌ క్యూరీలుగా నియమిస్తామని న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ మంగళవారం తెలిపారు. ఆప్‌ నాయకులపై సీబీఐ నమోదు చేసిన కేసును తొలుత ట్రయల్‌ కోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టులో అప్పీలు చేయగా, ఆ పిటిషన్‌ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. ఆమె పక్షపాతంతో వ్యవహరిస్తారని, అందువల్ల విచారణకు హాజరుకాబోమని ఆప్‌ నాయకులు తెలిపారు. తమ తరఫున న్యాయవాదులను కూడా నియమించబోమని చెప్పారు. దాంతో ఆప్‌ నాయకుల తరఫున న్యాయవాదులు లేకుండా విచారణ ప్రారంభించడం సరికాదని భావించిన న్యాయమూర్తి కేసును ఈ నెల ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు. వారి తరఫున వాదనలు వినిపించడానికి న్యాయవాదులను నియమిస్తామని తెలిపారు. వారి పేర్లను శుక్రవారం ప్రకటిస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 07:11 AM