Share News

రేపు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్న సీపీఐ

ABN , Publish Date - Aug 31 , 2026 | 02:01 PM

సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీ‌లోని రామ్‌లీలా మైదానంలో రేపు భారీ ర్యాలీ జరగనుంది. 12 ఏళ్ల పాలనలో మోదీ వైఫల్యాలను నినదిస్తూ సీపీఐ ఈ ర్యాలీ చేపట్టనుంది. 'బదలావ్ జరూరీ హై' అనే పేరుతో చేపట్టనున్న ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న సీపీఐ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

రేపు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టనున్న సీపీఐ
CPI Rally Delhi

ఇంటర్నెట్ డెస్క్: సీపీఐ ఆధ్వర్యంలో ఢిల్లీ‌లోని రామ్‌లీలా మైదానంలో రేపు(మంగళవారం) భారీ ర్యాలీ జరగనుంది. 12 ఏళ్ల పాలనలో మోదీ వైఫల్యాలను నినదిస్తూ సీపీఐ ఈ ర్యాలీ చేపట్టనుంది. 'బదలావ్ జరూరీ హై' అనే పేరుతో చేపట్టనున్న ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్న సీపీఐ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పన్నేండేళ్ల పాలనలో మోదీ ప్రధానిగా విఫలమయ్యారని విమర్శించారు. మైనారిటీల విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఇండియాలో ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. దేశ రాజధానిలో నిర్వహించే ఈ ర్యాలీలో డి.రాజా సహా పలువురు జాతీయ నేతలు పాల్గొంటారు. అంతేకాకుండా.. ఏపీ, తెలంగాణ నుంచి సీపీఐ శ్రేణులు భారీగా పాల్గొననున్నాయి.


పన్నేండేళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను రామకృష్ణ కింది విధంగా పేర్కొన్నారు.

  • ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాలేదు.

  • అవినీతిని నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైంది.

  • వన్ నేషన్–వన్ ఎలక్షన్‌ ద్వారా సమాఖ్య వ్యవస్థను బలహీనపరచడానికి కుట్ర పన్నుతోంది.

  • డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తోంది.

  • మైనారిటీల భద్రతను గాలికి వదిలేసింది.

  • ధరల పెరుగుదలను అరికట్టలేకపోయింది.

  • నిరుద్యోగాన్ని నిర్మూలించలేకపోయింది.

Updated Date - Aug 31 , 2026 | 02:07 PM