రేపు కాంగ్రెస్ భారీ నిరసన
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:37 AM
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని కాంగ్రెస్ ప్రకటించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 10: జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంట్లో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపింది. దేశంలో ప్రజాస్వామ్యం ఉనికి గురించి ఆందోళన చెందుతున్న ప్రతీ భారతీయుడూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ర్యాలీ అనంతరం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతి పత్రం అందజేస్తామని తెలిపింది.