Share News

కాంగ్రెస్‌ విజేతల్లో అత్యధికులు ముస్లింలే

ABN , Publish Date - May 06 , 2026 | 06:13 AM

నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచినవారిలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే..

కాంగ్రెస్‌ విజేతల్లో అత్యధికులు ముస్లింలే

  • అసోం, కేరళల్లో 80 శాతం స్ట్రైకింగ్‌ రేటు

న్యూఢిల్లీ, మే 5 : నాలుగు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచినవారిలో అత్యధికులు ముస్లింలే ఉన్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే.. అసోంలో కాంగ్రెస్‌ 19 సీట్లు దక్కించుకోగా, 18 చోట్ల ముస్లింలు విజయం సాధించారు. ఇక్కడ 20 మంది ముస్లింలకు ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ మిత్రపక్షం రాయిజోర్‌ దళ్‌ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు ముస్లిం. కేరళను కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకుంది. 140 సీట్లు కలిగిన ఈ రాష్ట్రంలో 35 చోట్ల ముస్లింలు వేర్వేరు పార్టీల నుంచి పోటీచేసి గెలిచారు. ఇందులో 30 మంది కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి నుంచే బరిలోకి దిగారు. ఇందులో ఎనిమిది మంది కాంగ్రెస్‌, తక్కిన 22 మంది మిత్రపక్షాల నుంచి పోటీచేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌ గెలిచిన రెండు సీట్లలోనూ ముస్లిములే విజేతలుగా నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌ మొత్తం 63 మంది ముస్లింలకు సీట్లు ఇచ్చింది. తమిళనాడులో పొత్తులో భాగంగా తనకు దక్కిన కొద్ది సీట్లలో రెండు ముస్లింలకు ఇవ్వగా, ఒకరు గెలిచారు. ఇక.. కేరళ, అసోంల్లో కాంగ్రెస్‌, మిత్రపక్షాలు నిలిపిన ముస్లిముల్లో గెలుపు శాతం 80 శాతం ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:13 AM