కేరళకు కాంగ్రెస్ పరిశీలకులుగా మాకెన్, వాస్నిక్
ABN , Publish Date - May 06 , 2026 | 05:43 AM
రళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించడానికి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు...
న్యూఢిల్లీ, మే 5: కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసే విషయమై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించడానికి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు పరిశీలకులను నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్, కోశాధికారి అజయ్ మాకెన్‌లు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. శాసనసభా పక్ష సమావేశం తేదీని నిర్ణయించిన తరువాత వారు కేరళకు వెళ్తారు. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, సీనియర్ నాయకులు వి.డి.సతీషన్, రమేష్ చెన్నితల పోటీపడుతున్నారు. మరోవైపు అసోంలో శాసనసభా పక్ష నేతను ఎన్నుకునే కార్యక్రమానికి పరిశీలకుడిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ సహ పరిశీలకుడిగా నియమితులయ్యారు.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్