Share News

ఐస్‌క్రీమ్‌ బండిలో రూ.700 కోట్ల కొకైన్‌!

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:50 AM

ఐస్‌క్రీమ్‌ బండిలో పెట్టి అక్రమంగా తరలిస్తున్న రూ.700 కోట్ల విలువైన కొకైన్‌ను రెవెన్యూ దర్యాప్తు విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు

ఐస్‌క్రీమ్‌ బండిలో రూ.700 కోట్ల కొకైన్‌!
cockine

  • అక్రమంగా తరలింపు.. ఇద్దరి అరెస్టు

చెన్నై, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఐస్‌క్రీమ్‌ బండిలో పెట్టి అక్రమంగా తరలిస్తున్న రూ.700 కోట్ల విలువైన కొకైన్‌ను రెవెన్యూ దర్యాప్తు విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరి ని అరెస్టు చేశారు. చైన్నైలోని మాధవరంలో భారీయెత్తున మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ జరుగుతోందని సమాచారం అందటంతో అధికారులు ఆ ప్రాంతం లో బుధవారం రాత్రి నిఘా వేశారు. మాధవరంలోని ఐస్‌క్రీమ్‌లు తయా రు చేస్తున్న కర్మాగారం వద్ద ఐస్‌క్రీమ్‌ తోపుడు బండిని నెట్టుకుని వెళుతున్న ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు సోదా చేశారు. అందులో వరుసగా పేర్చి ఉన్న పొట్లాలు బయల్పడ్డాయి. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని, ఆ పొట్లాలను స్వాధీనం చేసుకుని పరీక్షించ గా, అది మేలిమి రకం కొకైన్‌గా స్పష్టమైంది. 70కిలోల బరువున్న ఆ కొకైన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 700 కోట్లు అని అధికారులు తెలిపారు.

Updated Date - Nov 20 , 2026 | 06:09 AM