Share News

సీజేపీ నేతల అరెస్టుకు యోచన అయినా 10న ఆందోళన ఆగదు

ABN , Publish Date - Oct 06 , 2026 | 03:00 AM

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండుతో ఈ నెల 10న ఆందోళన చేయడానికి ముందే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు.

సీజేపీ నేతల అరెస్టుకు యోచన  అయినా 10న ఆందోళన ఆగదు
souravdas

  • జైలుకెళ్లడానికే కాదు, అంతకన్నా దారుణమైన

పరిస్థితులకు కూడా సిద్ధం: సౌరవ్‌ దాస్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 5: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండుతో ఈ నెల 10న ఆందోళన చేయడానికి ముందే తమ పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సహ కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు. తనతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఇతర నాయకులు అశుతోష్‌ రంకా, రత్న సింగ్‌ తదితరులను అరెస్ట్‌ చేయాలని ఆలోచిస్తోందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. యువత మేల్కొందని, తాము ఉన్నా లేకున్నా హక్కులు, భవిష్యత్తు కోసం పోరాడుతుందని తెలిపారు. జైలుకెళ్లడానికే కాదు, అంతకన్నా దారుణమైన పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను భారత దేశ నెంబర్‌-1 శత్రువని గతంలో ఆయన ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 03:02 AM