జెన్ జీకి భయపడి ఢిల్లీలో ఎమర్జెన్సీ: సీజేపీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 03:47 AM
జెన్ జీ యువతకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించిందని సీజేపీ నేతలు సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్‌దాస్ అషుతోష్ రాణా ప్రకటించారు.
జెన్ జీ యువతకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఎమర్జెన్సీ విధించిందని సీజేపీ నేతలు సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, సౌరవ్‌దాస్ అషుతోష్ రాణా ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ఢిల్లీ ఏమైనా మోదీ, అమిత్ షాల జాగీరా అని ప్రశ్నించారు. పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడే నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. రైళ్లను రద్దు చేయడం, మెట్రోస్టేషన్లను మూసేయడం హాస్యాస్పదమని అభిజీత్ దీప్కే అన్నారు. యువతను చూసి అంతగా భయంగా ఉంటే ఈ దేశం మొత్తాన్ని మూసేయండి అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ‘ఎక్స్’లో ఒక వీడియో విడుదల చేశారు. అరెస్టులకు భయపడబోమని, ఏం జరిగినా చరిత్ర సృష్టిస్తామని సీజేపీ నేత ఆశుతోష్ పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను నిర్బంధిస్తున్నారని.. దేశంలో ఎమర్జెన్సీ విధించారని సౌరవ్‌దాస్ ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
సీజేపీ నిరసన.. అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ బంద్