రాకెట్‌ను కిందకి దించి... వలలో ఒడిసి పట్టి..!
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:04 AM
అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా పునర్వినియోగ రాకెట్ సాంకేతికలో ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. స్పేస్‌ఎక్స్ తరహాలో..
పునర్వినియోగ రాకెట్ సాంకేతికతలో చైనా ముందడుగు
న్యూఢిల్లీ, జూలై 10: అంతరిక్ష పరిశోధనల్లో చైనా మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. తొలిసారిగా పునర్వినియోగ రాకెట్ సాంకేతికలో ఒక ప్రధాన మైలురాయిని అధిగమించింది. స్పేస్‌ఎక్స్ తరహాలో తన ‘లాంగ్ మార్చ్-10ఏ’ రాకెట్ మొదటి దశను సముద్రంలోని ఫ్లోంటింగ్ ప్లాట్‌ఫామ్‌పై విజయవంతంగా ల్యాండ్ చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ (సీఏఎ్‌ససీ) శుక్రవారం హైనాన్ కమర్షియల్ స్పేస్ లాంచ్ సైట్ నుంచి ‘లాంగ్ మార్చ్-10ఏ’ క్యారియర్ రాకెట్‌ను నింగిలోకి పంపించింది. రాకెట్ మొదటి, రెండు దశలు విడిపోయిన సుమారు ఆరు నిమిషాల తర్వాత మొదటి దశ బూస్టర్ తనంతట తాను వేగాన్ని నియంత్రించుకుంటూ నిలువుగా కిందకు దిగి సముద్రంలో రికవరీ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేసిన పెద్దవలలో సురక్షితంగా దిగింది.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్