Share News

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లు

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:55 AM

భారత భూభాగాలపై కన్నేసిన చైనా మెల్లమెల్లగా సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తోంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో వివాదం నెలకొని ఉన్న ప్రాంతాల్లోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దళాలు చొచ్చుకువస్తున్నాయి.

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా చొరబాట్లు
boundaries

  • సలామీ స్లైసింగ్‌’ వ్యూహంతో

  • కొద్దికొద్దిగా ముందుకు..

  • వివాదమున్న ప్రాంతాల్లోకి

  • చొచ్చుకొస్తున్న పీఎల్‌ఏ దళాలు

  • ఉపగ్రహ ఛాయాచిత్రాలతో

  • ఇండిపెండెంట్‌ కథనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: భారత భూభాగాలపై కన్నేసిన చైనా మెల్లమెల్లగా సరిహద్దుల్లోకి చొచ్చుకువస్తోంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో వివాదం నెలకొని ఉన్న ప్రాంతాల్లోకి చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) దళాలు చొచ్చుకువస్తున్నాయి. 2022 నాటి, ప్రస్తుత ఉపగ్రహ చిత్రాలను పోల్చుతూ బ్రిటన్‌ వార్తా సంస్థ ఇండిపెండెంట్‌ దీనిపై ప్రత్యేక కథనం వెలువరించింది. భారత్‌లో బ్రిక్స్‌ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరైన సందర్భంలో ఈ అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హం. విశ్లేషకుల అంచనా ప్రకారం.. ‘సలామీ స్లైసింగ్‌’ వ్యూహంతో చైనా సైన్యం ముందుకు వస్తోంది. అంటే ఒక్కసారిగా చొచ్చుకురాకుండా.. దశలవారీగా కొద్దికొద్దిగా చొచ్చుకువస్తూ, ఆ ప్రాంతంలో తమ దళాల ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. అరుణాచల్‌లోని అప్పర్‌ సుభాన్‌సిరి లోయ, జరి, లుంగే ప్రాంతాల్లో కొత్తగా భవనాలు, రహదారులు నిర్మిస్తోంది. జూన్‌ నుంచి చైనా సైన్యం ముందుకు వస్తోందని, తాము వేటాడే, పశువులకు మేత తీసుకొచ్చే ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటోందని సరిహద్దు గ్రామాల్లోని గిరిజనులు చెబుతున్నారని ఇండిపెండెంట్‌ వెల్లడించింది. నిజానికి ఇటీవలికాలంలో చైనా దూకుడుపై ఇలాంటి ప్రచారం జరుగుతోంది. అదంతా ఉత్తిదేనని భారత సైన్యం పలుమార్లు ప్రకటించింది కూడా.

ఈ వార్తలు కూడా చదవండి

ఒకే ఫ్రేమ్‌లో మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. బ్రిక్స్ ఫ్యామిలీ ఫొటో వైరల్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి.. ఆంథ్రోపిక్ సీఈఓ‌కు మస్క్, ఆల్ట్‌మన్ మద్దతు

Updated Date - Sep 14 , 2026 | 04:58 AM