చెన్నై ఎయిర్‌పోర్టులో 15 కోట్ల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 05 , 2026 | 06:45 AM
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.15 కోట్ల విలువ చేసే గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాఽధీనం చేసుకుని, నగరానికి చెందిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి అరెస్టు
చెన్నై, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.15 కోట్ల విలువ చేసే గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాఽధీనం చేసుకుని, నగరానికి చెందిన ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాగ్ నుంచి చెన్నైకు శుక్రవారం రాత్రి ఒక ప్రైవేటు విమానం వచ్చింది.
ఆ విమానాన్ని కస్టమ్స్, ఎయిర్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేయగా...థాయిలాండ్‌కు టూరిస్టుగా వెళ్లి తిరిగొచ్చిన 28 ఏళ్ల ప్రయాణికుడి ప్రవర్తనపై సందేహం వచ్చింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు అతడి సూట్‌కేసులో 26 ప్యాకెట్లలో మొత్తం రూ.15 కోట్ల విలువ చేసే 15 కేజీల హైడ్రోఫోనిక్ రకానికి చెందిన అత్యంత ఖరీదైన గంజాయి బయటపడింది. విమానాశ్రయ పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.