టెలిగ్రామ్, సిగ్నల్‌కు కూడా కేంద్రం నోటీసులు!
ABN , Publish Date - Jul 02 , 2026 | 10:36 PM
మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల యూజర్‌నేమ్ ఫీచర్‌పై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల యూజర్‌నేమ్ ఫీచర్‌పై సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకు కూడా నోటీసులు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిన్న వాట్సాప్‌కు పంపిన నోటీసుల తరహాలోనే టెలిగ్రామ్, సిగ్నల్ నుంచి కేంద్రం వివరణ కోరినట్టు తెలుస్తోంది. యూజర్‌నేమ్ ఫీచర్ దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని కేంద్రం కోరింది.
యూజర్‌నేమ్ ఫీచర్‌ను త్వరలో లాంచ్ చేస్తామని వాట్సాప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. టెలిగ్రామ్‌లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది. సిగ్నల్‌లో యూజర్లు తమకు కావాలనుకుంటే ఈ ఫీచర్‌ను ఎంచుకోవచ్చు. యూజర్‌నేమ్‌తో వినియోగదారులు తమ ఫోన్‌నెంబర్ల అవసరం లేకుండానే కేవలం ఐడీలను షేర్ చేసి కొత్తవారితో చాటింగ్ మొదలుపెట్టవచ్చు. యూజర్ల వ్యక్తిగత గోప్యత నిబంధనలను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు గతంలో ఈ మేసేజింగ్ యాప్స్ చెప్పుకొచ్చాయి.
అయితే, ఈ ఫీచర్‌తో ఆన్‌లైన్ మోసాలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులను పోలినట్టు ఉన్న ఐడీలతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడే అవకాశం ఉందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఫీచర్‌పై పూర్తిస్థాయి సంప్రదింపులు పూర్తయ్యే వరకూ భారత్‌లో లాంఛ్ చేయవద్దని కేంద్రం వాట్సాప్‌కు నిన్నటి నోటీసుల్లో స్పష్టం చేసింది. నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు వాట్సాప్‌కు మూడు రోజుల గడువు ఇచ్చింది.
ఈ వార్తలనూ చదవండి:
టీఎంసీలో చీలిక.. ఇరు పక్షాలకు ఈసీ నోటీసులు
శివకాశి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు