Share News

యూజర్‌నేమ్‌ ఫీచర్.. వాట్సాప్‌కు ఇచ్చిన డెడ్‌లైన్‌ పొడిగింపు

ABN , Publish Date - Jul 05 , 2026 | 06:29 PM

యూజర్‌నేమ్ ఫీచర్‌పై వివరణ కోరుతూ వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసుల డెడ్‌లైన్‌ను కేంద్రం తాజాగా పొడిగించింది.

యూజర్‌నేమ్‌ ఫీచర్.. వాట్సాప్‌కు ఇచ్చిన డెడ్‌లైన్‌ పొడిగింపు
Center Extends deadline for Whatsapp

ఇంటర్నెట్ డెస్క్: యూజర్‌నేమ్ ఫీచర్‌పై వివరణ కోరుతూ వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసుల డెడ్‌లైన్‌ను కేంద్రం తాజాగా పొడిగించింది. యూజర్‌నేమ్ ఫీచర్‌లోని భద్రతాపరమైన అంశాలపై వివరణ ఇచ్చేందుకు కేంద్రం తొలుత జులై 6ను డెడ్‌లైన్‌గా విధించింది. తాజాగా తుది గడువును మరో మూడు రోజుల పాటు పొడిగించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

భారత్‌లో యూజర్ నేమ్ ఫీచర్‌ను వాయిదా వేయాలని గతంలో కేంద్రం వాట్సాప్‌ను ఆదేశించింది. ఈ విషయంలో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం అప్పట్లో పేర్కొంది. అంతేకాకుండా, ఈ ఫీచర్‌ దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కూడా కేంద్రం వాట్సాప్‌ను ఆదేశించింది. ఆ తరువాత టెలిగ్రామ్, సిగ్నల్‌ యాప్‌లకూ ఇవే నోటీసులను జారీ చేసింది.


అయితే, ఈ ఫీచర్‌పై తలెత్తిన అందోళనపై వాట్సాప్ కూడా స్పందించింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్ భద్రతా వ్యవస్థలు మరింత కట్టుదిట్టం అవుతాయని తెలిపింది. యూజర్‌నేమ్‌లు వెతికేందుకు వాట్సాప్‌లో ఎలాంటి సెర్చ్ ఫీచర్ ఉండదని కూడా పేర్కొంది. ఇతరుల యూజర్‌నేమ్‌ను పోలినట్టు ఉండే ఐడీలతో ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే తాము తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

ముంబైని వణికిస్తున్న వర్షాలు.. చెట్టు కూలి ఓ వ్యక్తి మృతి..

రామాలయ విరాళాల చోరీ విచారకరం.. కఠిన శిక్ష పడాల్సిందేనన్న మోహన్ భాగవత్

Updated Date - Jul 05 , 2026 | 07:42 PM