Share News

గ్యాస్‌ బుకింగ్‌కు 35 రోజులనేది అవాస్తవం కేంద్రం

ABN , Publish Date - Mar 26 , 2026 | 06:26 AM

వంట గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువును చమురు సంస్థలు 35 రోజులకు పెంచాయనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది....

గ్యాస్‌ బుకింగ్‌కు 35 రోజులనేది అవాస్తవం కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 25: వంట గ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ గడువును చమురు సంస్థలు 35 రోజులకు పెంచాయనే వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. గడువు పెంపుపై ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని, ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ బుధవారం ఓ ప్రకటన చేసింది. గ్యాస్‌ బుకింగ్‌ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని, కనెక్షన్‌తో సంబంధం లేకుండా పట్టణ ప్రాంతాల్లో రీఫిల్‌ బుకింగ్‌కు 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు అలాగే కొనసాగుతుందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కు సూపర్ స్యూస్!

ధురంధర్-2 డైలాగ్‌తో బుమ్రాకు భార్య సంజన పంచ్.. పోస్ట్ వైరల్

Updated Date - Mar 26 , 2026 | 06:26 AM