ఆ యాప్స్‌ను తొలగించండి.. గూగుల్, యాపిల్‌కు కేంద్రం ఆదేశాలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 09:24 PM
అనుమానాస్పద బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను యాప్‌స్టోర్‌ల నుంచి తొలగించాలంటూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను తాజాగా ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: అనుమానాస్పద బ్యాటరీ మేనేజ్‌మెంట్ యాప్‌లను యాప్‌స్టోర్‌ల నుంచి తొలగించాలంటూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను తాజాగా ఆదేశించింది. ఈ యాప్స్‌తో ఈ-రిక్షాల బ్యాటరీ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను రిమోట్‌గా నియంత్రించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. బీఏటీ-బీఎమ్ఎస్, స్మార్ట్ బీఎమ్ఎస్, లాస్సీజీవై తోపాటు మరో నాలుగు యాప్‌లను తొలగించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ యాప్‌లతో బ్లూటూత్ ఆధారంగా రిమోట్‌గా బ్యాటరీ నియంత్రణ వ్యవస్థలను షట్ డౌన్ చేయవచ్చన్న ఆందోళన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ వ్యవస్థతో వాహనాల్లోని బ్యాటరీల వోల్టేజీ, కరెంట్, చార్జింగ్ స్థాయిలు, ఉష్ణోగ్రతను జాగ్రత్తగా గమనించుకోవచ్చు. అయితే, బీఎమ్ఎస్ యాప్‌ల సాయంతో రిమోట్‌గా బ్యాటరీ వ్యవస్థను షట్ డౌన్ చేయడంతో ఈ-రిక్షాలు నడిరోడ్డు మీద ఆగిపోయిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. నాణ్యత సరిగా లేని బ్యాటరీల్లోని భద్రతా వ్యవస్థలు పటిష్ఠంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిని బ్లూటూత్ సాయంతో పాస్‌వర్డ్ లేకున్నా రిమోట్‌గా నియంత్రించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..