గంగాజలంతో సీఈసీ జ్ఞానేశ్ ఇల్లు శుద్ధి
ABN , Publish Date - Oct 07 , 2026 | 05:34 AM
కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల ఇంటిని గంగాజలంతో మంగళవారం శుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణం విజయ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టిన కొన్ని రోజులకే, ఇప్పుడు ‘శుద్ధీకరణ్’ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది
కాంగ్రెస్ నిరసన జరిగిన కొన్ని రోజులకు కార్యక్రమం
ఆగ్రా, అక్టోబర్ 6: కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పూర్వీకుల ఇంటిని గంగాజలంతో మంగళవారం శుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా పట్టణం విజయ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టిన కొన్ని రోజులకే, ఇప్పుడు ‘శుద్ధీకరణ్’ కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తోంది. తొలుత ఆలయం నుంచి కలశంలో గంగజలాన్ని జ్ఞానేశ్ కుమార్ ఇంటికి యాత్రగా తీసుకొచ్చారు. ఆ తర్వాత సుందరకాండ పారాయణం చేసి గంగా జలంతో ఇంటిని శుద్ధి చేశారు. సెప్టెంబర్ 28నాటి కాంగ్రెస్ నిరసన ప్రదర్శనతో ఇంటి పరిసరాలు మురికిగా మారాయని.. ఇంటి తలుపులపై అభ్యంతరకర వ్యాఖ్యలు రాశారని జ్ఞానేశ్ కుమార్ తల్లి సత్యవతి గుప్తా తెలిపారు. అలాగే నిరసనకారులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే గంగాజలంతో శుద్ధి చేసినట్లు చెప్పారు. అయితే, ఈ శుద్ధీకరణ కార్యక్రమంపై కాంగ్రెస్ వ్యంగ్యంగా స్పందించింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు జ్ఞానం ప్రసాదించే యజ్ఞం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఆగ్రా పట్టణ అధ్యక్షుడు అమిత్ సింగ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి