డీలిమిటేషన్ కమిషన్‌లో సీఈసీ జ్ఞానేష్‌కుమార్!
ABN , Publish Date - Nov 29 , 2026 | 06:07 AM
ఎస్‌ఐఆర్ పేరుతో దేశంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది
న్యూఢిల్లీ, నవంబరు 28: ఎస్‌ఐఆర్ పేరుతో దేశంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం రూపొందించిన బిల్లులో ప్రతిపాదించిన డీలిమిటేషన్ కమిషన్‌లో సీఈసీ సభ్యుడిగా ఉంటారు. డీలిమిటేషన్ (రెండో) బిల్లు-2026లోని సెక్షన్ 3 కింద నియోజకవర్గాలను పునర్విభజించేందుకు డీలిమిటేషన్ కమిషన్‌ను నియమిస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం నియమించే సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా రిటైర్డ్ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉంటారు. సభ్యులుగా సీఈసీ లేదా సీఈసీ ప్రతిపాదించే కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడితోపాటు డీలిమిటేషన్ జరిగే రాష్ట్రానికి చెందిన ఎన్నికల సంఘం సీఈవో సభ్యుడిగా ఉంటారు. ఈ ముగ్గురికీ కమిషన్‌లో ఓటుహక్కు ఉంటుంది.