సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:42 AM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా పడింది.
నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉన్నందునే!
రాయ్‌పూర్, అక్టోబరు 7: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఆయన బుధ, గురువారాల్లో (ఈ నెల 7, 8 తేదీల్లో) రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల సీఈసీ పర్యటన వాయిదా పడినట్లు ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది. తిరిగి పర్యటన ఎప్పుడు ఉంటుందన్నది ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం అందాక ప్రకటిస్తామని పేర్కొంది. కాగా,ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా దంతెవాడలోని దంతేశ్వరి ఆలయం, భోరమ్‌దేవ్‌లోని కబీర్‌ధామ్‌తోపాటు బస్తర్ జిల్లాలోని చిత్రకూట్ జలపాతాన్ని సందర్శించాలని జ్ఞానేశ్‌కుమార్ భావించారు. ఇందుకోసం ప్రొటోకాల్ కల్పించాల్సిందిగా రాష్ట్రంలోని అధికారులకు ఎన్నికల కమిషన్ సమాచారం ఇచ్చింది. అయితే ఎస్‌ఐఆర్ ప్రక్రియ నేపథ్యంలో సీఈసీకి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతుండడం, ఛత్తీస్‌గఢ్ లోనూ నిరసనలు ఎదురయ్యే అవకాశాలున్నందునే ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..