Share News

పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల సమస్యలకు 2 వారాల్లో పరిష్కారం

ABN , Publish Date - Apr 08 , 2026 | 06:08 AM

దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమేరాల ఏర్పాటుకు సంబంధించిన సమస్యలను రెండు వారాల్లో...

పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల సమస్యలకు 2 వారాల్లో పరిష్కారం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమేరాల ఏర్పాటుకు సంబంధించిన సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేస్తున్నానని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి చెప్పారు. పోలీసు స్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసినవి సక్రమంగా పనిచేయకపోవడంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. దేశమంతటా ఒకే తరహా విధానాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి..

యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..

Updated Date - Apr 08 , 2026 | 06:08 AM