సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..
ABN , Publish Date - Jun 02 , 2026 | 09:14 AM
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)కు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించిన విధానంపై సీబీఎస్‌ఈ నుంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి నివేదిక కోరింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)కు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించిన విధానంపై సీబీఎస్‌ఈ నుంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి నివేదిక కోరింది. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది (CBSE OSM row).
కోఎంప్ట్ (Coempt Edutech)కు కాంట్రాక్టును కేటాయించేటప్పుడు అనుసరించిన విధానాలు, నిర్ణయం తీసుకునే ప్రక్రియలో పాల్గొన్న అధికారులతో సహా, టెండర్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని సీబీఎస్‌ఈని మంత్రిత్వ శాఖ కోరింది. తొలిసారిగా అమలు చేసిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వేల ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సమాధాన పత్రాలు సరిగా స్కాన్ కాకపోవడం, పేజీలు కనిపించకపోవడం, మార్కుల లెక్కల్లో పొరపాట్లు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని వేల జవాబు పత్రాలను తిరిగి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాల్సి వచ్చింది (Online screen marking).
ఈ వివాదం రాజకీయ రంగు కూడా పులుముకుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు (CBSE tender controversy). ఓఎస్‌ఎమ్ టెండర్ ప్రక్రియలో మార్పులు చేసి కోఎంప్ట్‌కు అనుకూలంగా నిబంధనలను సడలించారని ఆరోపించారు. టెండర్ నిబంధనల్లో పలు మార్పులు జరిగాయని, దీంతో సంస్థకు అర్హత లభించిందని ఆయన పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ ఈ ఆరోపణలను ఖండించింది. అన్ని నిబంధనలను అనుసరించే కాంట్రాక్ట్ కేటాయించామని, ఎలాంటి అవకతవకలూ జరగలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ అంతర్గత విచారణకు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..