Share News

భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు

ABN , Publish Date - Mar 05 , 2026 | 06:03 AM

కెనడా యూనివర్సిటీల్లో చదివే భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఆ దేశం భారీమొత్తంలో స్కాలర్‌షిప్‌ ఫండ్‌ను ప్రకటించింది. 100 మిలియన్‌ డాలర్ల (రూ.921.6 కోట్లు)తో ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు...

భారత విద్యార్థులకు కెనడా స్కాలర్‌షిప్‌లు

ఆ దేశ వర్సిటీల్లో చదివేవారిలో ఏటా 200 మందికి..

రూ.921 కోట్లతో ఫండ్‌

న్యూఢిల్లీ, మార్చి4: కెనడా యూనివర్సిటీల్లో చదివే భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఆ దేశం భారీమొత్తంలో స్కాలర్‌షిప్‌ ఫండ్‌ను ప్రకటించింది. 100 మిలియన్‌ డాలర్ల (రూ.921.6 కోట్లు)తో ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. కెనడా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ప్రతిభ ఆధారంగా ఏటా 200 మందికి ఈ నిధి ద్వారా స్కాలర్‌షిప్స్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన విద్యార్థులకు కోర్సు పూర్తయ్యేవరకు చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను చెల్లిస్తారు. ఈ నిధిని యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో నిర్వహిస్తుంది. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ భారత పర్యటన అనంతరం ఈ స్కాలర్‌షి్‌ప్సను ప్రకటించారు. ‘కెనడా-భారత్‌ టాలెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్ట్రాటజీ’లో ఈ ఉపకార వేతనాల నిధి ప్రధానమైందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యూహంలో భాగంగా భారత్‌లో రెండు దేశాల విద్యాసంస్థలు కలిసి మూడు ప్రాంతాల్లో హైబ్రిడ్‌ స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి. వీటిల్లో శాస్త్రసాంకేతిక రంగం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై బోధన, అధ్యయనం ప్రధానాంశాలుగా ఉంటాయి. ఈ హైబ్రిడ్‌ స్టడీ సెంటర్ల ద్వారా కెనడా విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కార్నీ పర్యటన సందర్భంగా రెండు దేశాల విద్యా సంస్థల మధ్య 13 ఒప్పందాలు కుదిరాయి. ఐఐటీ తిరుపతి, ఐసర్‌-తిరుపతి భాగస్వామ్యంతో డల్హౌసీ యూనివర్సిటీ ఇన్నోవేషన్‌ క్యాంప్‌సను భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో, మెక్‌గిల్‌ వర్సిటీల ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలు కూడా మనదేశంలో ఏర్పాటు చేస్తారు.

ఇవీ చదవండి:

ఇరాన్ యుద్ధం.. పెరగనున్న వంటింటి బడ్జెట్..

జీడీపీకి చమురు సెగ

Updated Date - Mar 05 , 2026 | 06:03 AM