Share News

ధూమపాన నిషేధంపై యూకే లాంటి చట్టం భారత్‌లో సాధ్యమేనా

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:44 AM

ధూమపాన రహిత సమాజం కోసం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఓ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. 2008 డిసెంబరు 31 తర్వాత పుట్టిన వారికి సిగరెట్ల అమ్మకాన్ని...

ధూమపాన నిషేధంపై యూకే లాంటి చట్టం భారత్‌లో సాధ్యమేనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: ధూమపాన రహిత సమాజం కోసం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఓ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. 2008 డిసెంబరు 31 తర్వాత పుట్టిన వారికి సిగరెట్ల అమ్మకాన్ని ఆ బిల్లు నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి బిల్లు భారత్‌లో సాధ్యమేనా?అన్న చర్చ మొదలైంది. అయితే, పొగాకు ఉత్పత్తుల విషయంలో యూకేకు, భారత్‌కు మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. పొగాకు వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉన్నప్పటికీ దీనిలో సిగరెట్‌ వినియోగం 10-12ు మాత్రమే. బీడీలు, పాన్‌ మసాలా, ఖైనీ వంటి ఉత్పత్తులే ఎక్కువ. మరోవైపు, సిగరెట్లపై ప్రభుత్వం భారీగా ట్యాక్స్‌లు విధిస్తూ ఆదాయం గడిస్తోంది. టొబాకో ఇండియా ప్రకారం పొగాకు పరిశ్రమ ద్వారా భారత ప్రభుత్వానికి ఏటా సగటున రూ.76వేల కోట్ల ఆదాయం వస్తోంది. 4.5 కోట్ల మందికి ఉపాధి లభిస్తోంది. కాబట్టి పొగాకు ఉత్పత్తులపై ఒకేసారి కాకుండా దశల వారీగా నిషేధం విధిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆంధ్ర నెట్‌ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం

Updated Date - Apr 28 , 2026 | 07:36 AM