Share News

నేటి నుంచే బ్రిక్స్‌ సమావేశాలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:14 AM

బ్రిక్స్‌ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీలోని భారత్‌ మండపం సర్వ సన్నద్ధమైంది. భారత్‌ అధ్యక్షతన శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి.

నేటి నుంచే బ్రిక్స్‌ సమావేశాలు

ఇంటర్నెట్ విభాగం: బ్రిక్స్‌ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సుకు ఢిల్లీలోని భారత్‌ మండపం సర్వ సన్నద్ధమైంది. భారత్‌ అధ్యక్షతన శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. ఇటీవలికాలంలో బ్రిక్స్‌ కూటమిని విస్తరించిన నేపథ్యంలో.. 11 సభ్యదేశాలు, 10 భాగస్వామ్య దేశాలతోపాటు మరో 11 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. ప్రపంచ దేశాల అధినేతల హాజరు నేపథ్యంలో ఢిల్లీవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, ఇరాన్‌, పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన భద్రత, ప్రపంచ వాణిజ్యం, డాలర్‌ ఆధిపత్యం, బహుళ ధ్రువ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, కృత్రిమ మేధ, ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలపై ఇటీవలి సంక్షోభాల ప్రభావం తదితర అంశాలపై బ్రిక్స్‌ సమావేశాల్లో చర్చించనున్నారు. రష్యా, ఇరాన్‌ అధ్యక్షులు పుతిన్‌, పెజెష్కియాన్‌తోపాటు దక్షిణాఫ్రికా, ఈజిప్టు అధ్యక్షులు సిరిల్‌ రామఫోసా, అబ్దుల్‌ ఫతా అల్‌సిసీ, తదితరులు శుక్రవారమే ఢిల్లీకి చేరుకున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 06:15 AM