ఆందోళన రేపుతున్న రొమ్ము, నోటి క్యాన్సర్
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:42 AM
భారత్‌లో క్యాన్సర్ వ్యాప్తిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారత్‌లో క్యాన్సర్ వ్యాప్తిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఐసీఎంఆర్ తాజా అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార(సర్వైకల్) క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పడుతుండగా... రొమ్ము, నోటి క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. జీ20 దేశాల్లో క్యాన్సర్ కేసులు స్థిరంగా లేదా తగ్గుముఖం పట్టడం కనిపించగా.. భారత్‌లో మాత్రం దానికి భిన్నంగా 1998-2017 మధ్య రొమ్ము, నోటి క్యాన్సర్ కేసులు పెరిగాయి. అదే సమయంలో భారత్‌లో సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గాయని ఇటీవల ప్రచురితమైన పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఐదుగురు శాస్త్రవేత్తలతో కూడిన బృందం.. ఈ అధ్యయనంలో 1996 నుంచి 2020 వరకు జీ20 దేశాల్లో నమోదైన రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లు, వాటివల్ల సంభవించిన మరణాల తీరుని విశ్లేషించింది. ఈ క్రమంలో భారత్‌లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఏటా 1.83 శాతం పెరుగుతున్నట్టు ఈ బృందం అంచనా వేసింది. మగవారిలో నోటి క్యాన్సర్ కేసులు కూడా ఏడాదికి 1.2 శాతం పెరిగినట్టు పేర్కొంది. గర్భాశయ క్యాన్సర్ కేసులు మాత్రం.. అధ్యయనం చేసిన అన్ని దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఎక్కువగా తగ్గినట్టు గుర్తించింది. భారత్‌లో ఈ కేసులు ఏడాదికి సగటున 4.19 శాతం చొప్పున తగ్గినట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం