విద్యార్థులేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు
ABN , Publish Date - Oct 08 , 2026 | 01:51 AM
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎంపీఎస్సీ) నిర్వహించిన పరీక్షల్లో లోపాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు సంఘ విద్రోహ శక్తులేమీ కాదని, నిరసన తెలిపే హక్కు వారికి ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ముంబై, అక్టోబరు 7: మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎంపీఎస్సీ) నిర్వహించిన పరీక్షల్లో లోపాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు సంఘ విద్రోహ శక్తులేమీ కాదని, నిరసన తెలిపే హక్కు వారికి ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. పారదర్శకంగా, పకడ్బందీగా, ఎలాంటి అక్రమాలు జరగకుండా పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నొక్కి చెప్పింది. విద్యార్థుల నిరసనలకు వ్యతిరేకంగా పుణెకు చెందిన కొంతమంది స్థానికులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..