Share News

బెంగాల్‌లో మహిళలకు ఉచిత బస్సు

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:12 AM

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు వారిపై...

బెంగాల్‌లో మహిళలకు ఉచిత బస్సు

  • నెలకు రూ.3 వేలు.. బీజేపీ మ్యానిఫెస్టో

కోల్‌కతా, ఏప్రిల్‌ 10 : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్ర ఓటర్లలో దాదాపు 50 శాతం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు వారిపై వరాలు కురిపించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అలాగే, మహిళలకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం, ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలు, చొరబాటులను అడ్డుకోవడం వంటి హామీలను ఇచ్చింది. ‘సంకల్ప పత్ర’ పేరుతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం విడుదల చేశారు. దుర్గ సురక్ష స్క్వాడ్‌ పేరిట మహిళా పోలీసు బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద రైతులకు రూ.9000 సాయం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా టీఎంసీ పాలనపై అమిత్‌ షా తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ 15 ఏళ్ల పాలన రాష్ట్ర ప్రజలకు ఓ పీడకల అని పేర్కొన్నారు. రాజకీయ ప్రేరేపిత హింస, అవినీతి, చొరబాట్లు, నిరుద్యోగం తదితర సమస్యలపై త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు రిఫరెండం అని షా అన్నారు.

ఇవి కూడా చదవండి

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

చిన్నపిల్లల్లో జుట్టు తెల్లబడటానికి కారణాలు ఇవే

Updated Date - Apr 11 , 2026 | 06:12 AM