Share News

కాషాయ భారత్‌!

ABN , Publish Date - May 05 , 2026 | 04:39 AM

భారత్‌ కాషాయమయం అవుతోంది. దేశంలోని రాష్ట్రాల్లో 70శాతానికిపైగా బీజేపీ, మిత్రపక్షాల పాలనలోకి వచ్చాయి. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు ...

కాషాయ భారత్‌!

  • దేశంలోని 29 రాష్ట్రాల్లో.. 17 చోట్ల సొంత ప్రభుత్వాలు

న్యూఢిల్లీ, మే 4: భారత్‌ కాషాయమయం అవుతోంది. దేశంలోని రాష్ట్రాల్లో 70శాతానికిపైగా బీజేపీ, మిత్రపక్షాల పాలనలోకి వచ్చాయి. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు (ఢిల్లీ సహా)గాను 16 చోట్ల బీజేపీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలే ఉన్నాయి. బెంగాల్‌ విజయంతో ఈ సంఖ్య 17కు చేరుతోంది. మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి పాలన కొనసాగుతోంది. ఇక మిగిలిన ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయి.

బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలు: అస్సాం, అరుణాచల్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపూర్‌, ఒడిశా, రాజస్థాన్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బెంగాల్‌.

ఎన్డీయే కూటమి పాలనలోని రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, సిక్కిం, పుదుచ్చేరి (రాష్ట్ర హోదా ఉన్న కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతం). ఏపీలో టీడీపీ, మేఘాలయలో ఎన్‌పీపీ, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీ, సిక్కింలో ఎస్‌కేఎం, పుదుచ్చేరిలో ఏఐఎన్నార్సీ ఆధ్వర్యంలోని ప్రభుత్వాల్లో బీజేపీ భాగస్వామిగా ఉంది.

ప్రతిపక్షాల చేతిలో ఉన్న రాష్ట్రాలు: తాజాగా టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచిన తమిళనాడు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూడీఎఫ్‌ కూటమి మెజారిటీ సాధించిన కేరళ, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, ఆప్‌ పాలనలోని పంజాబ్‌, జేఎంఎం పాలనలోని జార్ఖండ్‌. జెడ్‌పీఎం పాలనలోని మిజోరం

1.jpg

విజయంతో కూతురుకు నివాళి ఆర్‌జీ కర్‌ మృతురాలి తల్లి గెలుపు

ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో అత్యాచారానికి, హత్యకు గురైన పీజీ మెడికల్‌ విద్యార్థిని తల్లి రత్నా దేబ్‌నాథ్‌ (బీజేపీ).. తన సమీప ప్రత్యర్థి అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మీద దాదాపు 29 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024లో జరిగిన ఆర్‌జీ కర్‌ ఘటన యావత్‌ బెంగాల్‌ను కదిలించింది. కొన్ని నెలలపాటు నిరసనలు కొనసాగాయి. మమత పాలనలో క్షీణించిన శాంతిభద్రతలకు ఇదొక దృష్టాంతమన్న విమర్శలు పెరిగిపోయాయి. తృణమూల్‌ ఓటమిలో ఈ ఘటన కూడా ఓ కారణంగా నిలిచింది.

Updated Date - May 05 , 2026 | 04:46 AM