బీజేపీకి ఏడాదిలో రూ.6,074 కోట్ల విరాళాలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:16 AM
2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి విరాళాలు వెల్లువెత్తాయి. మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తం కంటే ఆ పార్టీకి...
న్యూఢిల్లీ, మార్చి 26(ఆంధ్రజ్యోతి): 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి విరాళాలు వెల్లువెత్తాయి. మిగిలిన అన్ని జాతీయ పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తం కంటే ఆ పార్టీకి పది రెట్లు ఎక్కువగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు జాతీయ పార్టీలకు రూ.6,648.56 కోట్లు రాగా ఈ మొత్తంలో బీజేపీకి ఏకంగా రూ.6,074 కోట్ల విరాళాలు సమకూరాయి. రూ.20వేలకు పైగా వచ్చిన విరాళాల వివరాలను జాతీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించగా వాటి ఆధారంగా ఏడీఆర్ నివేదికను రూపొందించి గురువారం విడుదల చేసింది. 2024-25లో కాంగ్రె్‌సకు రూ.517 కోట్లు కోట్లు విరాళంగా వచ్చాయి. జాతీయ పార్టీల విరాళాల్లో 92ు(రూ.6,128 కోట్లు) కార్పొరేట్, వ్యాపార రంగాల నుంచి అందాయి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌కు కలిపి ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అత్యధికంగా రూ.2,413.46 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో బీజేపీకి రూ.2,180.71 కోట్లు, కాంగ్రె్‌సకు రూ.216 కోట్లు లభించాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి రూ.757.62కోట్లు, కాంగ్రె్‌సకు రూ.77.34కోట్లు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..