Share News

బీజేపీ కీలక నిర్ణయం.. నాలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన..

ABN , Publish Date - May 28 , 2026 | 12:21 PM

భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది.

బీజేపీ కీలక నిర్ణయం.. నాలుగు రాష్ట్రాలకు అధ్యక్షుల ప్రకటన..

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు నేడు (గురువారం) పంజాబ్, హర్యానా, ఢిల్లీ, త్రిపుర రాష్ట్ర విభాగాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ వివరాలు వెల్లడించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రాను నియమించింది. పంజాబ్ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు కేవల్ సింగ్ ధిల్లాన్‌ పేరును ప్రకటించింది. హర్యానా అధ్యక్షురాలిగా అర్చనా గుప్తాను, త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా అభిషేక్ దేబ్‌రాయ్‌ను నియమించింది.


తొలిసారి ఎంపీ అయిన హర్ష్ మల్హోత్రాకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. ప్రస్తుతం ఆయన కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. తూర్పు ఢిల్లీ నియోజకవర్గానికి హర్ష్ మల్హోత్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేశ రాజధానిలో బీజేపీని క్షేత్రస్థాయిలో మరింతగా బలోపేతం చేసేందుకు మల్హోత్రాను అధ్యక్షుడిగా ప్రకటించారు.


పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్ఠానం పావులు కదుపుతోంది. సిక్కు ప్రాతినిధ్యాన్ని చాటి చెప్పే వ్యూహాత్మక రచనలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉన్న బర్నాలా మాజీ ఎమ్మెల్యే కేవల్ సింగ్ ధిల్లాన్‌కి అధ్యక్ష పదవి కట్టబెట్టింది. కాగా, 2007 నుంచి 2017 వరకూ కాంగ్రెస్ తరఫున ఆయన ఎమ్మెల్యేగా పని చేశారు. కీలక పరిణామాల అనంతరం 2022లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అవలాంజి అటవీ ప్రాంతంలో తెల్ల పులి సంచారం

సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సిద్దరామయ్య

Updated Date - May 28 , 2026 | 12:58 PM