నకిలీ డిగ్రీలతో బిహార్‌లో 3 వేల మంది టీచర్లు
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:15 AM
నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన 3 వేల మందికి పైగా ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని...
వారందరిపై వేటు.. ఇప్పటి వరకు చెల్లించిన జీతాల వసూలుకు నిర్ణయం
పట్నా, జూలై 10: నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో ప్రభుత్వోద్యోగాలు పొందిన 3 వేల మందికి పైగా ఉపాధ్యాయులను విధుల్లోంచి తొలగించాలని బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారికి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించిన జీతభత్యాలను వడ్డీతో సహా తిరిగి వసూలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి మిథిలేశ్ తివారీ తెలిపారు. బిహార్‌లో 2006 నుంచి 2015 మధ్య జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో నిర్వహించిన సమగ్ర విచారణలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. నకిలీ విద్యాసంస్థల పేరుతో జారీ చేసిన డిగ్రీలు, ఫోర్జరీ సర్టిఫికెట్లను ఉపయోగించి అనేక మంది ప్రభుత్వోద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ విచారణ భయంతో కొందరు ఉపాధ్యాయులు ముందే రాజీనామా చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాంటి వారిని కూడా వదిలిపెట్టబోమన్నారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్