సీఎం పదవికి నితీశ్ రాంరాం?
ABN , Publish Date - Mar 05 , 2026 | 03:17 AM
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకోనున్నట్లు సమాచారం. పట్నాలో గురువారం ఉదయం పదకొండున్నరకు ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది....
నేడు రాజ్యసభకు బిహార్ ముఖ్యమంత్రి నామినేషన్!
హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశం
నితీశ్ తనయుడు నిశాంత్‌కు ఉప ముఖ్యమంత్రి
సీఎం పదవి రేసులో సమ్రాట్ చౌదరి, నిత్యానంద్
పట్నా, మార్చి 4: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీఎం పీఠాన్ని వదులుకోనున్నట్లు సమాచారం. పట్నాలో గురువారం ఉదయం పదకొండున్నరకు ఆయన రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా కూడా గురువారం రాజ్యసభకు నామినేషన్ వేయనున్నారు. నితీశ్ రాజ్యసభకు వెళ్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి, డిప్యూటీ సీఎం పదవి ఆయన తనయుడు నిశాంత్ కుమార్‌కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్న వారిలో ముందున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బిహార్‌లో 5 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. బిహార్‌లో 2దశాబ్దాలుగా నితీశ్ సీఎంగా కొనసాగుతున్నారు.