భోపాల్‌లో రూ.1.5కోట్లకు భర్తను అమ్మిన భార్య
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:01 AM
సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1994 తెలుగులో వచ్చిన ‘శుభలగ్నం’ మాదిరే ఓ మహిళ తన భర్తను.. ఆయన స్నేహితురాలికి రూ.1.5 కోట్లకే అమ్మేసిన ఉదంతం అందరినీ దిగ్ర్భాంతికి...
భోపాల్, ఫిబ్రవరి 17: సరిగ్గా 32 ఏళ్ల క్రితం 1994 తెలుగులో వచ్చిన ‘శుభలగ్నం’ మాదిరే ఓ మహిళ తన భర్తను.. ఆయన స్నేహితురాలికి రూ.1.5 కోట్లకే అమ్మేసిన ఉదంతం అందరినీ దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. ఆ భర్త (42) ఓ మహిళ (52)తో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తుండటంతో సదరు మహిళ న్యాయం కోసం భోపాల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. విచారణలో ఈ ముగ్గురికి కౌన్సిలింగ్‌తో సమస్య పరిష్కారానికి న్యాయస్థానం ప్రయత్నించినా.. సదరు వ్యక్తి ససేమిరా అన్నాడు. దీంతో అనూహ్యంగా సదరు మహిళ తన భర్తను వదులుకోవడానికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని చేసిన ప్రతిపాదనను ఆయన స్నేహితురాలు అంగీకరించింది. అదనంగా తన భార్య, ఇద్దరు కూతుళ్ల ఆర్థిక భద్రత కోసం రూ.27 లక్షల నగదు, ఇల్లును ఇవ్వడానికి ఆమె భర్త ఒప్పందం చేసుకున్నాడు. దీంతో మహిళ తన కూతుళ్లతో కొత్త ఇంటికెళ్లేందుకు సిద్ధం కాగా.. ఈ పరిష్కారాన్ని కోర్టు అధికారికం చేసేసింది.
ఇవి కూడా చదవండి..
ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ