Share News

ఆలయాల శిథిలాలతోనే ఆ మసీదు నిర్మాణం

ABN , Publish Date - May 06 , 2026 | 05:53 AM

‘భోజ్‌శాల ఆలయం-కమాల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌’ ఒకప్పుడు హిందూ ఆలయాల సముదాయమని, వాటి శిథిలాలతోనే...

ఆలయాల శిథిలాలతోనే ఆ మసీదు నిర్మాణం

‘భోజ్‌శాల ఆలయం-కమాల్‌ మౌలా మసీదు’పై మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఏఎన్‌‌ఐ వాదనలు

ఇండోర్‌, మే 5: ‘భోజ్‌శాల ఆలయం-కమాల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌’ ఒకప్పుడు హిందూ ఆలయాల సముదాయమని, వాటి శిథిలాలతోనే ప్రస్తుత కట్టడం (మసీదు) నిర్మాణం జరిగిందని భారత పురావస్తు విభాగం(ఏఎన్‌‌ఐ) వెల్లడించింది. ఈ మేరకు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఏఎన్‌‌ఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మంగళవారం వాదనలు వినిపించారు. రెండేళ్ల క్రితం ఏఎన్‌‌ఐ 98 రోజులపాటు జరిపిన శాస్త్రీయ సర్వే, అనంతరం రూపొందించిన 2 వేల పేజీలకుపైగా ఉన్న నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. మసీదు నిర్మాణం కంటే ముందే అక్కడ భారీ ఆలయం ఉన్నట్లుగా ఆ ప్రాంతంలో లభించిన పలు శిల్పాలు, స్తంభాల శిథిలాలు, శాసనాలు తెలియజేస్తున్నాయన్నారు. ఇవి పర్మార్‌ రాజవంశం కాలానికి చెందినవని తెలిపారు. కాగా, ఈ అంశంపై హైకోర్టు ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి విచారణ జరుపుతోంది.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 05:53 AM