విద్యార్థినికి 50ఏళ్ల ప్రొఫెసర్ ‘లవ్ ప్రపోజ్’!
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:13 AM
ఆ ప్రొఫెసర్ వయసు 50 ఏళ్లు! విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వ్యక్తి, తన వృత్తికే కళంకం తెచ్చాడు....
చెప్పులతో కొట్టిన యువతి, తోటి విద్యార్థులు
బెంగళూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆ ప్రొఫెసర్ వయసు 50 ఏళ్లు! విద్యార్థులకు పాఠాలు చెప్పి.. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వ్యక్తి, తన వృత్తికే కళంకం తెచ్చాడు. వయసు, బాధ్యత మరిచి.. తరగతి గదిలోనే ఓ విద్యార్థినికి ‘ఐ లవ్ యూ’ అంటూ ప్రేమ ప్రతిపాదన చేశాడు. దీనిపై ఆగ్రహించిన బాధిత యువతి, తోటి విద్యార్థులు ఆ ప్రొఫెసర్‌కు దేహశుద్ధి చేశారు. బయట అందరూ చూస్తుండగా, కాలేజీ అవరణలో చెప్పులతో కొట్టి తగిన బుద్ధి చెప్పారు. ఈ ఘటన బెంగళూరు నగర శివారు నెలమంగళలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అబ్దుల్ మొహ్మద్ అనే వ్యక్తి సిద్ధార్థ మెడికల్ కాలేజీ మైక్రో బయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం తరగతి గదికి వెళ్లి ‘మైక్’లోనే ఓ విద్యార్థినికి అందరి ముందు లవ్ ప్రపోజ్ చేశాడు. క్లాస్‌రూమ్‌లోని విద్యార్థులకు పంచి పెట్టేందుకు చాక్లెట్లు కూడా తీసుకువచ్చాడు. ఆ విద్యార్థిని తనకు గతంలో ప్రేమ ప్రతిపాదన చేసిందని ప్రొఫెసర్ చెప్పుకొచ్చాడు. బాధిత విద్యార్థిని తీవ్రంగా స్పందించడంతో విద్యార్థులంతా ఆ ప్రొఫెసర్‌పై కాలేజీ ఆవరణలో దాడి చేసి, చెప్పులతో కొట్టారు.
ఇవి కూడా చదవండి:
ప్రీతి జింటా నాకు సారీ చెప్పింది: ఆర్సీబీ ప్లేయర్
PL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..