Share News

పూజల పేరుతో జ్యోతిష్యుడి దారుణం.. మహిళను భయపెట్టి పలుమార్లు అత్యాచారం..

ABN , Publish Date - May 03 , 2026 | 01:44 PM

పూజల పేరు చెప్పి ఓ జ్యోతిష్యుడు దారుణానికి ఒడిగట్టాడు. బ్యూటీషియన్‌పై పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం బయటకు చెబితే భర్త, కుమారుడు రక్తం కక్కుకుని చనిపోతారంటూ భయపెట్టి మరీ దారుణానికి పాల్పడ్డాడు.

పూజల పేరుతో జ్యోతిష్యుడి దారుణం.. మహిళను భయపెట్టి పలుమార్లు అత్యాచారం..
bengaluru astrologer case

బెంగళూరు, మే 3: పూజల పేరు చెప్పి ఓ జ్యోతిష్యుడు దారుణానికి ఒడిగట్టాడు. బ్యూటీషియన్‌పై పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం బయటకు చెబితే భర్త, కుమారుడు రక్తం కక్కుకుని చనిపోతారంటూ భయపెట్టి మరీ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ రాజాజీనగర్‌లో బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఆమెకు కొన్ని నెలల క్రితం మోహన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.


పరిచయాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని రకాల పూజలు చేస్తే ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉందని మోహన్ ఆమెను నమ్మించాడు. 2025, జనవరి 30వ తేదీన ఆమెను రామనగరలోని పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయాలని చూశాడు. తర్వాత పూజ కోసం ఆమెను మైసూర్‌లోని చాముండి హిల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడినుంచి తిరిగి వస్తున్నపుడు కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం బయటకు చెబితే కుటుంబాన్ని శపిస్తానని బెదిరించాడు. ఫిబ్రవరి 10వ తేదీన మోహన్ మహిళ ఇంటికి వెళ్లాడు.


ఆమె భర్త, కొడుకును బయటకు పంపించాడు. తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. తన మాట వినకపోతే భర్త, కొడుకును చంపేస్తానని బెదిరించాడు. రోజురోజుకు అతడి వేధింపులు పెరగటంతో మహిళ తట్టుకోలేకపోయింది. పోలీసులను ఆశ్రయించింది. మోహన్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మోహన్ కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఓఆర్‌ఆర్‌పై వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

సాఫ్ట్‌వేర్ రంగంలో 18 ఏళ్ల అనుభవం.. ఏఐ దెబ్బకు జీవితం తారుమారు..

Updated Date - May 03 , 2026 | 01:50 PM