400 కోట్ల దోపిడీ కేసు కొట్టివేత!
ABN , Publish Date - Feb 17 , 2026 | 06:29 AM
మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బెళగావి జిల్లాలో రూ.400 కోట్ల నగదు దోపిడీ’ కేసు...
బెంగళూరు, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బెళగావి జిల్లాలో రూ.400 కోట్ల నగదు దోపిడీ’ కేసును కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, నేరాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని మహారాష్ట్రలోని ఇగాత్పురి కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అరెస్టు అయిన ఏడుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన సిట్.. ఫిర్యాదుకు, దర్యాప్తులో తేలిన అంశాలకు పొంతనలేదని తేల్చింది. దోపిడీపై మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సందీప్ పాటిల్ చేసిన ఫిర్యాదే అబద్ధమని పేర్కొంది. అయితే, అతనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..