రాజ్యాంగాన్ని సవరించి బీసీ రిజర్వేషన్లు పెంచాలి
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:02 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్‌రావు డిమాండ్ చేశారు..
కేసన డిమాండ్.. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా
న్యూఢిల్లీ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఏపీ అధ్యక్షుడు కేశన శంకర్‌రావు డిమాండ్ చేశారు. శుక్రవారం, ఏపీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. బీసీ సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. కేశన మాట్లాడుతూ ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.